Mon Mar 16 2026 15:08:31 GMT+0530 (India Standard Time)
BRS : బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీలో నిల్చుని
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించారు.
నినాదాలు చేస్తూ...
"రైతులకు వెన్నుపోటు, రాహుల్‌కు 1000 కోట్లు".. “రాహుల్ బంధు కాదు, రైతుబంధు కావాలి”.. “పెన్షన్లు పెంచే మాట మరిచారు, పేదవాళ్ల నడ్డి విరిచారు”.. “మహాలక్ష్మి పథకం మాట మరిచారు, మహిళలను నట్టేట ముంచారు” అంటూ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో నిల్చుని తమ నిరసనను తెలియజేశారు. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణుల నిరసన వ్యక్తం చేశారు.
Next Story

