Sat Mar 14 2026 22:20:37 GMT+0530 (India Standard Time)
నేడు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ
నాందేడ్ లో నేడు భారత రాష్ట్ర సమితి సభ జరగనుంది. నాందేడ్ పట్టణంలో ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

నాందేడ్ లో నేడు భారత రాష్ట్ర సమితి సభ జరగనుంది. నాందేడ్ పట్టణంలో ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మార్చారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి ఇతర రాష్ట్రాల్లో సభను నిర్వహిస్తున్నారు. అందుకోసమే ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ నుంచి...
మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లతో పాటు ఎమ్మెల్యేలు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. వారం రోజుల నుంచి నాందేడ్ లోనే మకాం వేసి సభ ఏర్పాట్లను చూశారు. నాందేడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. రైతులు, వివిధ వర్గాల వారితో సమావేశమై వారిని సభకు రప్పించేలా ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.
Next Story

