Fri Apr 10 2026 20:35:50 GMT+0530 (India Standard Time)
BRS : తెలంగాణలో కారు స్పీడు అందుకుందా?
తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది.

తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.కేవలం రెండున్నరేళ్లలోనే బీఆర్ఎస్ పూర్తిగాపడి పోయిన గ్రాఫ్ ను తిరిగి అందుకుంటుంది. ఈరోజు జీవన్ రెడ్డి చేరికతో ఈ విశ్లేషణ కాదు.అనేక వర్గాల నుంచి వినిపిస్తున్న వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం సవరించు కోకపోతే రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్నట్లు తానే 2034 వరకూ ముఖ్యమంత్రి ని అన్న మాట ఒట్టిదే అవ్వడానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను బీఆర్ఎస్ అందిపుచ్చుకుంటుందన్నవిశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఫామ్ హౌస్ లోనే ఉన్నా...
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ ఆ పార్టీ పుంజుకోవడాన్ని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనంలోకి రాకముందే ఆ పార్టీకి అంత హైప్ రావడమేంటని కాంగ్రెస్ నేతల్లోనే చర్చ జరుగుతుంది. హెచ్సీయూ,లగచర్ల, వెలుగుమట్ల,మూసీ,హైడ్రా.. సమస్య ఏదైనా బీఆర్ఎస్ పట్ల సానుకూలత జనంలో వస్తుందంటున్నారు. మూసీ రిజర్వాయర్ ప్రక్షాళన సయితం కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారిందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనేక ప్రజా సమస్యలపై...
బీఆర్ఎస్ లో హరీశ్ రావు, కేటీఆర్ లు ముందుండి పోరాటాలు చేస్తున్నారు. హిల్ట్ పాలసీలపైన అధికారపార్టీని ఒకింత వెనకడుగు వేయించగలిగారన్న భావన ఉంది. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ లో చేరినప్పటికీ వారిని ఉక్కిరి బిక్కిరి చేయడంలో న్యాయపరంగా గులాబీ పార్టీ సక్సెస్ అయిందని చెబుతున్నారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్,పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, 35 శాతం ఓటు షేర్ ను తెచ్చుకోవడం ఒకింత గెలుపుకు దగ్గర అని భావించి మరికొందరు నేతలు గులాబీ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
అధికారుల్లోనూ అదే ఆలోచనా?
అధికారుల్లో కూడా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న భావన పెరిగింది. అందుకు ఉదాహరణ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీరు లేక కళ్లముందే ఎండిపోతుండటంతో కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా.. తమ గ్రామాల కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటల ఫోటోలను చూసిన కేసీఆర్నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేయడంతో వెంటనే కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో నీరు ఉరకలెత్తుతుంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.
Next Story

