Mon Feb 16 2026 20:07:28 GMT+0530 (India Standard Time)
BRS : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కనిపించకపోవడం డానికి అసలు రీజన్ అదేనా?
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ ను కోలుకోనివ్వకుండా చేశాయి

తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ ను కోలుకోనివ్వకుండా చేశాయి. తాము అత్యధిక స్థానాల్లో గెలిచామని చెప్పుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మెన్స్ ఇవ్వకపోవడం కొంత నేతల్లో, క్యాడర్ లో ఆందోళన నెలకొంది. అయితే అధికారం లేనప్పుడు ఈ మాత్రమైనా స్థానాలను దక్కించుకున్నామంటే చాలు అని సంతృప్తి పొందుతుంది. పదిహేడు మున్సిపాలిటీలను మాత్రమే 116 మున్సిపాలిటీల్లో గెలుచుకుంది. ఏడు కార్పొరేషన్లలో ఒక్కటీ దక్కలేదు.ఈ ఎన్నికల ఫలితాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. బీఆర్ఎస్ కు ఓటు బ్యాంకు ఉన్న స్థానాల్లోనూ వెనకబడి పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
నాడు బలంగా ఉన్న చోట...
ముఖ్యంగా పార్టీకి ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ వంటి చోట్ల కార్పొరేటర్ స్థానాలు గెలవలేకపోతున్నారు. వరంగల్ వంటి చోట్ల ఆదరణ కోల్పోయింది. దక్షిణ తెలంగాణలో అసలు లెక్కలోకి రావడం లేదు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పునాదులు కూడా కదిలిపోయాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పార్టీకి వెన్నెముకగా ఉండేవి. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోవడంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురు కావడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం నైరాశ్యంలో ఉండిపోవడంతో కారు పార్టీ ఈ ఎన్నికల్లో అనుకున్నంత
దక్షిణ తెలంగాణలోనూ...
దక్షిణ తెలంగాణలోనూ బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుడపడలేదని ఈ ఫలితాలు నిరూపించాయి. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. ఇక్కడ బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖమ్మంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలవలేక పోవడం, దక్షిణ తెలంగాణలో పార్టీ పునరుజ్జీవం ఇక సాధ్యమేనా అన్న అనుమానాలను కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మున్సిపాలిటీ కే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా , హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలోని మిగిలిన 80 శాతం ప్రాంతాల్లో ప్రభావం కోల్పోయి, కేవలం మెదక్ తో పాటు సిటీ శివార్లపై ఆధారపడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నించాలి. కవిత ఎఫెక్ట్ కూడా పనిచేసిందనే చెప్పాలి.
Next Story

