Mon Mar 16 2026 01:11:43 GMT+0530 (India Standard Time)
BRS : మనసు మారలేదు.. రాజీనామా లేఖను పంపి మరీ
బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది

బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పదవుల కోసము, టిక్కెట్ల కోసమో ఇతర పార్టీలలో చేరే వారి సంఖ్య ఇటీవల ఎక్కువయింది. తాజాగా వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు.
వరంగల్ ఎంపీగా...
పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగేందుకు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇటీవల ఆయనను పిలిచి కేసీఆర్ బుజ్జగించినా తన మనసు మాత్రం మార్చుకోలేదు. చివరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story

