Sun Mar 15 2026 00:18:45 GMT+0530 (India Standard Time)
పార్లమెంటు ఎదుట బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలుు ఆందోళనకు దిగారు. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అదానీ వ్యవహారంపై...
పార్లమెంటు ప్రారంభమయిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానీని ఈ ప్రభుత్వం వెనకేసుకు వస్తుందని, అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. మోదీ-అదానీ పేర్లను కలిపి మోదానీ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎంపిల ధర్నాకు కొందరు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతు తెలిపారు.
Next Story

