Sun Mar 15 2026 14:25:16 GMT+0530 (India Standard Time)
నేడు కమిషన్ ఎదుటకు కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేడు జాతీయ మహిళ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేడు జాతీయ మహిళ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హాజరవ్వాలని కమిషన్ ఆదేశించింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ కమిషన్ కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
గవర్నర్ ను దూషించిన ...
ఈరోజు ఉదయం తమ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆపుతున్నారంటూ ఒక సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నేడు ఢిల్లీలో జాతీయ మహిళ కమిషన్ ఎదుట కౌశిక్ రెడ్డి హాజరు కానున్నారు.
Next Story

