Wed Jan 21 2026 05:01:30 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేడు కవిత కేసు విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసును నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసును నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై సీబీఐ ఛార్జిషీటు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కవిత ప్రమేయాన్ని పేర్కొంటూ అనేక విషయాలను సీబీఐ అధికారులు ఛార్జిషీటులో పొందుపర్చారు.
కవిత పాత్రపై...
కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తర్వాత సీీబీఐ అధికారులు తీహార్ జైలులో ఉన్న కవితను అరెస్ట్ చూపించారు. ఈ కేసులో నేడు విచారణ జరగనుంది.
Next Story

