Fri Dec 05 2025 15:55:53 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ కు కవిత తాజాగా లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమర్జెన్సీ బృందాల టెండర్లు రద్దు చేయాలని లేఖలో కోరారు. వర్షాకాలంలో చేపట్టే ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కవిత లేఖలో పేర్కొన్నారు.
కాంట్రాక్టులలో నిబంధనలు....
ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలనే పనులకు వినియోగించేలా నిబంధనలు రూపొందించారన్న కల్వకుంట్ల కవిత కేవలం రెండు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లబ్ది చేకూర్చేలా చేశారని ఆరోపించారు. ఈ నిబంధనలతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందన్న కల్వకుంట్ల కవిత వార్డుల వారీగా టెండర్లు పిలవాలని కోరారు. దీనిపై తక్షణమే స్పందించాలని కోరారు.
Next Story

