Mon Feb 02 2026 03:21:06 GMT+0000 (Coordinated Universal Time)
Kavitha : కవితకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ట్రయల్ కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ తో పాటు ఎంపీ వడ్డి రవిచంద్ర పది లక్షల రూపాయల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. రిలీజ్ కోసం ప్రాసెస్ పూర్తి చేయడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు ఈమెయిల్ పంపింది.
రేపు మధ్యాహ్నం బయలుదేరి...
దీంతో కల్వకుంట్ల కవిత ఈరోజు రాత్రికి తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. తీహార్ జైలులో విడుదల చేయడానికి రెండు గంటల ప్రాసెస్ ఉంటుంది. బీఆర్ఎస్ నేతల ఇప్పటికే తీహార్ జైలు చేరుకున్నారు. కవితకు స్వాగతం పలకనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రేపు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. విచారణకు హాజరైన అనంతరం కవిత, కేటీఆర్, హరీశ్ రావులు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీలో బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Next Story

