Fri Dec 05 2025 16:48:22 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : తెలంగాణ తల్లి విగ్రహం పోలికలు తనలా ఉంటాయా? నేను ఇక్కడి ఆడబిడ్డను కాదా?
బీఆర్ఎస్ ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను తామేదో ఇచ్చినట్లు చెప్పుకోవటం ఎందుకు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను తామేదో ఇచ్చినట్లు చెప్పుకోవటం ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారని, తాను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా? అని ఆమె ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్తు కోతలు....
ఇప్పుడే రాష్ట్రంలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయని, హైదరాబాద్ నగరంలో మూడు నుంచి నాలుగు గంటలు విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా ఎందుకు నియమించారని కవిత ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సలహాదారు ఎందుకంటూ ఆమె నిలదీశారు. అసలు సలహాదారులే వద్దని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా నియమిస్తున్నారంటూ కవిత ఫైర్ అయ్యారు. రాజకీయ పునరావాసం కోసం పదవులను రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నారన్నారు.
Next Story

