Sun Dec 07 2025 07:17:04 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలను లైట్ గా తీసుకోండి
వైఎస్ షర్మిలను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు

వైఎస్ షర్మిలను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు ఎవరు ఏం చేస్తారు? ఏం చేశారన్నది అందరికీ తెలుసునని తెలిపారు. బండి సంజయ్ మాటలు తనను బాధించాయన్నారు. తనపై అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయకుండా ఉండాల్సిందని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అభిప్రాయపడ్డారు.
దాడులకు భయపడబోం...
తెలంగాణలో బీజేపీని ప్రజలు తరిమికొడతారని ఆమె అన్నారు. తమపై విమర్శలు చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం సీీబీఐ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తుందన్నారు. దాడులకు ఇక్కడ ఎవరూ భయపడపోరన్నారు. ఎన్ని దాడులు జరిగినా తాము ఎదరిస్తూనే ఉంటామని తెలిపారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ ప్రజలు బీఆర్ఎస్ ను దగ్గరకు తీసుకుంటారన్నారు.
Next Story

