Fri Mar 20 2026 10:24:02 GMT+0530 (India Standard Time)
Breaking : జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి గురైన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు పెద్దయెత్తు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు సీీఐడీ, ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
జైలు నుంచి రాగానే....
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా, ఈరోజే కవిత బయటకు రావాలని సోదరుడు కేటీఆర్ విడుదలకు కావాల్సిన ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలిగారు. కవిత జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళతారు. రేపు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరై తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story

