Sun Mar 15 2026 07:17:12 GMT+0530 (India Standard Time)
kavita : ఢిల్లీ నుంచి బయలుదేరిన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. తన సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ తో కలసి ఆమె ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు వర్చువల్ గా కవిత హాజరయ్యారు. అయితే విచారణను సెప్టంబరు 11వ తేదీకి వాయిదా వేశారు.
న్యాయమే గెలుస్తుందంటూ....
దీంతో ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కవిత ఈ సందర్భంగా అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని కవిత మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తొలి నుంచి చెబుతున్నట్లు తాను ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటపడతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత చేరుకునే అవకాశముంది.
Next Story

