Fri Dec 05 2025 17:50:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో మాయం.. కవిత ఫొటో ఒక్కటే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మరో వివాదానికి దారి తీసింది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మరో వివాదానికి దారి తీసింది. ప్రొటోకాల్ రగడ తలెత్తింది. మంచిర్యాలలో కల్వకుంట్ల ఫొటోలతో మాత్రమే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతే తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో కాని, హరీశ్ రావు ఫొటో కానీలేకపోవడం చర్చనీయాంశమైంది.
విభేదాలు పర్యటనలో...
నిన్న కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈరోజు మంచిర్యాల పర్యటనలో మరోసారి విభేదాలు కారు పార్టీలో ఉన్నట్లు కనిపించాయి. పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతోనే కేవలం కవిత ఫొటోలతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారన్నది క్యాడర్ లో వినిపిస్తున్న మాట. మరి కవిత, కేటీఆర్ ల వైరం క్షేత్రస్థాయిలో కూడా కనపడుతుందనే భావించాలి.
Next Story

