Fri Dec 05 2025 16:44:55 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కేసీఆర్ కు కవిత ఘాటు లేఖ.. ఆరు పేజీలతో సమస్తం ప్రస్తావిస్తూ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మనసులో మాటను చెప్పేశారు. బీఆర్ఎస్ అగ్రనేత, తన తండ్రి కేసీఆర్ కు ఘాటు లేఖ రాశారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మనసులో మాటను చెప్పేశారు. బీఆర్ఎస్ అగ్రనేత, తన తండ్రి కేసీఆర్ కు ఘాటు లేఖ రాశారు. మొత్తం ఆరు పేజీల లేఖను ఆమె కేసీఆర్ కు రాశారు. తనను ఆరు నెలల పాటు జైల్లో ఉంచిన బీజేపీపై ఎందుకు విరుచుకుపడలేదని కవిత లేఖలో ప్రస్తావించారు. వరంగల్ లో జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో ఎందుకు బీజేపీ పై విమర్శలు చేయలేదని ఆమె నిలదీశారు. బీజేపీపై పొత్తు ఉంటుందా? లేదా? అన్న దానిపై వరంగల్ సభలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారని కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. దశాబ్దాలకాలం పాటు తాను పార్టీ కోసం పనిచేస్తే వరంగల్ సభలో తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆమె ప్రస్తావించారు.
బీజేపీ ఎందుకు విమర్శలు చేయలేదు?
బీజేపీ వల్ల తాను ఎంత నరకం అనుభవించానో తెలిసి కూడా ఆ పార్టీపై ఎందుకు విమర్శలు చేయలేకపోయారని కేసీఆర్ కు లేఖలో కోరారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారితో వేదికపై మాట్లాడకపోవడం ఏంటని కూడా కవిత ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ ఇప్పటి వరకూ రాకపోవడానికి కారణాలు కూడా చెప్పాలని కల్వకుంట్ల కవిత లేఖలో నిలదీశారు. పార్టీ లీడర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కూడా కవిత అభ్యంతరం చెప్పారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడాన్ని కడా కవిత తప్పుపట్టారు. పాత ఇన్ ఛార్జులకే లోకల్ బాడీ బీపాం లు ఇవ్వడానికి కారణాలు ఏంటని కూడా కవిత ప్రశ్నించారు. వరంగల్ సభలో పంచ్ లు లేకుండా ఎందుకు ముగించారని కవిత అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై...
రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించకపోడం ఎందుకని ఆమె అన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఎందుకు మాట్లాడలేదని కూడా ఆమె లేఖలో కేసీఆర్ ను నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్నిమార్చడంపై కూడా ఎందుకు మాట్లాడలేదని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. బీజేపీపై కేవలం రెండునిమిషాలు మాట్లడటం అందరినీ ఆశ్చర్యపర్చిందని అన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తారనుకున్నా అది ఎందుకు చేయలేకపోయారన్నారు. తెలంగాణ గీతం విషయాన్నికూడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. కవిత లేఖ బీఆర్ఎస్ లో సంచలనం రేపిందని చెప్పాలి. సొంత కుటుంబంలోనే ఈ లేఖ చిచ్చు పెట్టిందన్న కామెంట్స్ బహిరంగంగా వినపడుతున్నాయి. కవిత మై డియర్ డాడి అంటూనే లేఖలో కేసీఆర్ పై దాడికి దిగినట్లయింది.
Next Story

