Fri Dec 05 2025 17:35:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మరోసారి కల్వకుంట్ల కవిత ఓపెన్.. ఈసారి ఎవరిపైనంటే?
మంచిర్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మీడియాతో చిట్ చాట్ చేశారు.

మంచిర్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మీడియాతో చిట్ చాట్ చేశారు. తన బాధంతా పార్టీని కాపాడు కోవడం కోసమేనని అన్నారు. తనకంటూ వేరే అజెండా ఏమీ లేదని ఆమెచెప్పారు. పార్టీని కాపాడు కోవాలన్నదే తన తపన అని అన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దన్నదే తన ప్రధాన డిమాడ్ అని కల్వకుంట్ల కవిత మరోసారి అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన వచ్చిందని, అయితే దానిని నాడు తాను తీవ్రంగా వ్యతిరేకించానని మరోసారి గుర్తు చేశారు.
ఏ పార్టీ బాగుపడలేదు...
బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయవద్దన్నదే తన వాదన అని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. తనకంటూ సొంత అజెండా అంటూ ఏమీ లేదన్న కల్వకుంట్ల కవిత ఉద్యమ పార్టీగా వచ్చి పదేళ్లు ప్రజలకు పాలన అందించిన పార్టీని విలీనం చేయడం పట్ల తన అభ్యంతరమని ఆమె అన్నరు. తాను లేఖ రాయడంలో ఎలాంటి తప్పులేదన్న కల్వకుంట్ల కవిత లేఖను బయటపెట్టిన వారిని ముందు పట్టుకోవాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేశారు.
Next Story

