Mon Jun 16 2025 19:09:56 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కల్వకుంట్ల కవిత
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. కేసీఆర్ తో కవిత కొద్దిసేపు భేటీ అయినట్లు తెలిసింది. తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత కల్వకుంట్ల కవిత తొలిసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. కల్వకుంట్ల కవిత లేఖ రాయడంతో పాటు తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.
లేఖ రాసిన తర్వాత...
నేడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హాజరయ్యేందుకు వెళుతుండటంతో కవిత అక్కడకు చేరుకుని కేసీఆర్ తో మాట్లాడినట్లు తెలిసింది. తొలుత కవితకు అపాయింట్ మెంట్ లేదని ప్రచారం జరిగినా కవిత మాత్రం నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోకి వెళ్లి కేసీఆర్ ను కలిసినట్లు చెబుతున్నారు. కేసీఆర్ మరికాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తున్నారు.
Next Story