Sun Dec 14 2025 19:34:36 GMT+0000 (Coordinated Universal Time)
BRS : సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు బైఠాయించారు

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి క్షమాఫణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ తాము సీఎం ఛాంబర్ ముంద నుంచి కదలమని స్పష్టం చేశారు. నిన్న మహిళ ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను నిరసిస్తూ ఈ ఆందోళనకు దిగారు.
క్షమాపణ చెప్పాలని...
మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని వారు కోరారు. మహిళ ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.
Next Story

