Sun Mar 15 2026 09:35:39 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. పోటా పోటీ నినాదాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ ప్రారంభమయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ రేస్ పై చర్చకు పట్టుబట్టారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ ప్రారంభమయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ రేస్ పై చర్చకు పట్టుబట్టారు. అయితే దీనికి స్పీకర్ అనుమతించకపోవడంతో స్పీకర్ పై పేపర్లు చించి విసిరేయడంతో పాటు పోడియం వద్ద కు వెళ్లి నినాదాలు చేయడంతో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదాను వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దళిత స్పీకర్ పై దాడికి దిగారంటూ బీఆర్ఎస్ సభ్యులపై కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ ఆరోపణలివీ...
అయితే తమకు షాదనగర్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు పెట్టడమే కాకుండా చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ అహంకార పూరిత దోరణిని ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శంకర్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరించారని, కావాలంటే ఫుటేజీ చూడాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. రెచ్చగొట్టిన శంకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అంశంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

