Sat Mar 21 2026 10:22:37 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డి ఒక తాగుబోతు అంటూ సంచలన కామెంట్స్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చిన తర్వాత కండకావరం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బ్రోకర్ అంటూ ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి ఒక తాగుబోతు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
సబ్జెక్ట్ లేని సన్నాసి...
తెలంగాణ మంత్రివర్గంలో సబ్జెక్ట్ లేని ఒక సన్నాసి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావును అనే నైతిక హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద కామెంట్స్ చేసే స్థాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందా? అంటూ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
Next Story

