Sun Mar 15 2026 05:18:29 GMT+0530 (India Standard Time)
నేడు విచారణకు పాడి కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈరోజు ఉదయం పది గంటలకు ఆయనను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను విచారించనున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు
విధులకు ఆటంకం కలిగించారని...
ఇటీవల పాడి కౌశిక్ రెడ్డికి ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న దానిపై కేసు నమోదయిన నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో ఎవరెవరున్నారన్న దానిపై పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని విచారణ చేయనున్నారని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

