Sun Mar 15 2026 07:39:27 GMT+0530 (India Standard Time)
నేడు గన్‌పార్క్ వద్దకు హరీశ్ రావు.. సవాల్ కు సిద్ధమా అంటూ?
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు చేరుకోనున్నారు.

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు చేరుకోనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద తన రాజీనామా లేఖను తీసుకుని వస్తున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేరకుంటున్నారు. దీంతో పోలీసులు గన్ పార్క్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హరీశ్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను అక్కడకు రాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయి.
ఆగస్టు 15వ తేదీ లోపు...
ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రైతుల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాడానికి సిద్ధమా? తాను ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య సవాళ్ల యుద్ధం ఉద్రిక్తత వాతావరణం కల్పించింది.
Next Story

