Mon Mar 16 2026 05:33:22 GMT+0530 (India Standard Time)
Breaking : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి చేరారు

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి చేరారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో ఇద్దరూ పార్టీలో చేరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
చేెవెళ్ల ఎంపీగా...
రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి చేవెళ్ల ఎంపీగా గెలిచారు. మరోసారి పోటీ చేసేందుకు ఆయన అంగీకరించలేదు. ఆయన ఈరోజు ఉదయమే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డి సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
Next Story

