Fri Dec 05 2025 19:07:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీఆర్ఎస్ పార్టీ సమావేశం
బీఆర్ఎస్ సమావేశం నేడు జరగనుంది. తెలంగాణలో జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు

భారత రాష్ట్ర సమితి పార్టీ సమావేశం నేడు జరగనుంది. తెలంగాణలో జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ నిర్వహణపై చర్చించనున్నారు. దీంతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
వచ్చే ఎన్నికలకు...
అయితే వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేయనున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు చివరి సారి వార్నింగ్ కేసీఆర్ ఇవ్వనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యల కోసం కృషి చేయాలని పిలుపు నివ్వనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు.
- Tags
- brs meeting
- kcr
Next Story

