Fri Dec 05 2025 14:25:44 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్
బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు

బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. రేపు తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరవుతానని కేసీఆర్ నేతలతో చెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై...
బడ్జెట్ లో నిధుల కేటాయింపులపై అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే సభకు రావాలని, అందరూ ముందుగా ప్రిపేర్ అయి వస్తేనే అధికార పక్షాన్ని నిలదీయ గలుగుతామని కేసీఆర్ తెలిపారు. దీంతో పాటు రైతులు ఎదుర్కొంటున్నసమస్యలతో పాటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
Next Story

