Fri Dec 05 2025 18:37:42 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను నేడు అధినాయకత్వం విడుదల చేసే అవకాశముంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను నేడు అధినాయకత్వం విడుదల చేసే అవకాశముంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మాత్రం బీఆర్ఎస్ కు ఖచ్చితంగా వస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో బలాబలాలను బట్టి ఒక స్థానంలో సులువుగా కారు పార్టీ గెలుచుకుంటుంది. అయితే రెండో స్థానంలో పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
రెండింటిలో పోటీ చేసే...
రెండింటిలో పోటీ చేసి కాంగ్రెస్ కు చెక్ పెట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది. వారి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 38 ఎమ్మెల్యేలున్నా వారిలో పది మంది కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. అందుకే నేడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అభ్యర్థులను పోటీకి దింపితే ఎన్నిక అనివార్యమవుతుంది.
Next Story

