Tue Dec 09 2025 13:50:39 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavita : మీరు రెండంటే.. వాళ్లు నాలుగంటారు కవితక్కా
కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు

కల్వకుంట్ల కవిత రెండు అని నాలుగు అనిపించుకుంటున్నారు. తమ పార్టీ అధినేత కుమార్తె అని కూడా బీఆర్ఎస్ నేతలు చూడటం లేదు. తమపై విమర్శలు చేసిన వెంటనే రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా వంగి వంగి నమస్కారాలు చేసిన వారే నేడు తిట్లదండకాన్ని అందుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన తర్వాత కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యలపై స్పందిస్తే బాగుంటుందని, కానీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తుంటే అది కేసీఆర్ పాలనపైనే పడినట్లు కాదా? అని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరిట రాష్ట్రంలో పర్యటించవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రజా సమస్యలను కూడా ఆమె ప్రస్తావించవచ్చు.
పార్టీకి ఇబ్బందికరమే...
కానీ బీఆర్ఎస్ నేతలపై ఆమె విమర్శలు చేయడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే ప్రతి దాడి చేస్తున్నారు. కవిత రెండు విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాత్రం తగ్గకుండా పూర్తి స్థాయిలో కవితను కార్నర్ చేస్తుండటంతో గులాబీ పార్టీ అభిమానులు లోపల బాధపడుతున్నారు. అదే సమయంలో కవిత కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విమర్శలు కల్వకుంట్ల కవిత చేయడంతో ఆయన లిక్కర్ రాణి అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా మాధవరం కూడా...
తాజాగా కూకట్ పల్లిలో తిరుగుతూ బీఆర్ఎస్ బీటీం, యూటీం అంటూ మల్లారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత విరుచుకుపడటంతో అందుకు దీటుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. . కవిత చరిత్ర ఏంటో తనకు తెలుసునని ఆయన అన్నారు. ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని అన్నారు. కేసీఆర్ పై అభిమానంతో తాము కవితపై మాట్లాడటం లేదని మాధవరం కృష్ణారావు అన్నారు. నీ సంగతి, నీ మొగుడు సంగతి ఏంటో తనకు తెలుసునని అన్నారు.మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసునని మాధవరం కృష్ణారావు అన్నారు. నీ బండారం బయటపెడితే నువ్వు బయట కూడా తిరగలేవని మాధవరం కృష్ణారావు అన్నారు. హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి, కేటీఆర్ ను అరెస్ట్ చేయించి దోచుకు తినడానికే ప్లాన్ చేశామని ఆయన మండిపడ్డారు. నీ మొగుడి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని మాధవరం కృష్ణారావు అన్నారు. ఇలా కల్వకుంట్ల కవిత రెండు అని నాలుగు తగిలించుకుని తిరుగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story

