Sat Mar 21 2026 21:55:21 GMT+0530 (India Standard Time)
BRS : బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు

కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి బొమ్మలు బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేస్తున్నారు. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. దీంతో అనేక చోట్ల నిరనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అనేక నియోజకవర్గాల్లో...
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. హైదరాబాద్ మలక్పేట్ అక్బర్ బాగ్లో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి మలక్పేట్ నియోజకవర్గ ఇంచార్జ్ అజిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారర.నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామ గ్రామాన దిష్టిబొమ్మల దహనం, శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయి.అచ్చంపేట మండలం అంకిరంపల్లి, తెలకపల్లి మండలం కారువంగతో పాటు పాలు మండలాల్లోని గ్రామాల్లో, తండాల్లో దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు.
Next Story

