Thu Jan 29 2026 02:39:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పోచారం ఇంటివద్ద ఉద్రిక్తత.. ఇంటిముందు బీఆర్ఎస్ కార్యకర్తలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టారు. పోచారం పార్టీని వదలి వెళతారన్న ప్రచారంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంటికి వచ్చారని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకుని నినాదాలు చేశారు.
ధర్నాకు దిగిన...
పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీకి ద్రోహం చేసి వెళ్లివద్దంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచిపోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story

