Sun Apr 28 2024 22:56:56 GMT+0000 (Coordinated Universal Time)
దానంపై అనర్హత వేటు వేయండి : బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫారం తీసుకుని కారు పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు.
స్పీకర్ కు పిటీషన్...
ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు పిటీషన్ ఇచ్చారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
Next Story