Thu Dec 18 2025 17:52:24 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ నేత
బీఆర్ఎస్ నేతలు వరస పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తుండటం గులబీ పార్టీ నేతలను కలవర పెడుతుంది

బీఆర్ఎస్ నేతలు వరస పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తుండటం గులబీ పార్టీ నేతలను కలవర పెడుతుంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
డిప్యూటీ మేయర్ ....
హైదరాబాద్ నగరంలో గత ఎన్నికల్లో జీరో స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ నాయకత్వం నగరంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందుకే ముఖ్యమైన నేతలను పార్టీలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తుంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటీవల కలవడం, ఇప్పుడు డిప్యూటీ మేయర్ కూడా భేటీ కావడంతో జీహెచ్ఎంసీపై రేవంత్ ఫోకస్ పెట్టారని అర్ధమవుతుంది.
Next Story

