Sat Mar 21 2026 13:50:50 GMT+0530 (India Standard Time)
BRS : కౌశిక్ రెడ్డిపై నేతలు తిరుగుబాటు
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు

హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. రహస్యంగా జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు కీలక నేతలు వందల మంది హాజరయ్యారంటున్నారు. కౌశిక్ రెడ్డి ఏకపక్ష వైఖరికి నిరసనగా వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.
రహస్య సమావేశం...
బీఆర్ఎస్ లో ఉండి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఉండే కంటే కాంగ్రెస్ లోకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమయినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే తాము పార్టీని వీడటం ఖాయమని కొందరు తెగేసి చెప్పినట్లు తెలిసింది.
Next Story

