Tue Mar 24 2026 09:48:44 GMT+0530 (India Standard Time)
ముహూర్తం ఖరారు
బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేరికకు ముహూర్తం ఖరారయింది. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు

బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేరికకు ముహూర్తం ఖరారయింది. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్లో తన కుమారుడికి మెదక్ సీటు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపిన మైనంపల్లి ఢిల్లీలో జాతీయ పార్టీ నేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
చర్చలు జరిపేందుకు...
అయితే మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు జరిపేందుకు దామోదర రాజనర్సింహ, అంజనీకుమార్ యాదవ్, మల్లు భట్టి విక్రమార్కలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారు. మైనంపల్లికి రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మెదక్ ఆయన కుమారుడికి, మల్కాజ్గిరి మైనంపల్లికి ఇచ్చేందుకు ఓకే అనడంతోనే ఆయన పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించారు. ఎల్లుండి రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
Next Story

