Fri Dec 05 2025 12:23:17 GMT+0000 (Coordinated Universal Time)
అందాల పోటీలకు అన్ని కోట్లు ఎక్కడివి?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. అందాల పోటీల పేరుతో కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారని అన్నారు. కానీ సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న హరీశ్ రావు పేదలు, రైతుల కోసం సర్కార్ డబ్బులు లేవంటోందన్నారు. మరోవైపు రూ.లక్ష కోట్ల పనులకు టెండర్లు పిలిచిందని, కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఈ నిధులు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తుందని హరీశ్ రావు అన్నారు.
సంక్షేమ పథకాలకు మాత్రం...
డబ్బులు లేకపోతే లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు ఎలా చేస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ పనులు కమీషన్ల కోసమా, ఢిల్లీకి కప్పం కోసమా అని హరీశ్ రావు నిలదీశారు. అందాల పోటీల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న హరీశ్ రావు రైతులకు విత్తనాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. కనీసం రైతు భరోసా, రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Next Story

