Sun Mar 15 2026 09:35:44 GMT+0530 (India Standard Time)
Harish : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆగస్టు 15లోపు అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని అన్నారు. అందుకు సిద్ధమా? అని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.
రుణమాఫీ చేస్తే...
ఆగస్టు పదిహేనో తేదీ లోపు ఆయన చెప్పినట్లు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేసిన వెంటనే తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, తాను రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని అన్నారు. అందుకు సిద్ధమయితే తన సవాల్ ను స్వీకరించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు వాగ్దానాలను మరోసారి రేవంత్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
Next Story

