Fri Dec 05 2025 10:27:12 GMT+0000 (Coordinated Universal Time)
సునీల్ కుమార్ సస్పెన్షన్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే?
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్సెన్సన్ పై బీఆర్ఎస్ నేత, ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్సెన్సన్ పై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అన్న అక్కసుతోనే పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లారని చెప్పడం కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే? నన్న ఆయన సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నపుడే చెప్పాడు కదా తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని. అప్పుడు ఆయనకు ఎక్స్ ఇండియా జీవో ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా? అని ప్రశ్నించారు. అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్ గా వచ్చాయని ప్రవీణ్ కుమార్ అన్నారు.
మీరు దావోస్ వెళ్లలేదా?
సునీల్ కుమార్ అందరి లాగా డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తో ప్రజల పైసలతో పోలేదు కదా? అయనకు ముప్పై ఏళ్ల సర్వీస్ లో ఆ అవకాశాన్ని ప్రభుత్వం ఎన్నడూ ఇవ్వలేదు కదా. ఈ మరో శంభూక సంహరణ పర్వం గురించి మళ్లెపుడైనా మాట్లాడుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిజానికి ఈ మూర్ఖపు కండక్ట్ రూల్ ను అప్లై చేస్తే దేశంలో సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండ్ అవుతారని, దావోస్ కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చని, మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగారా? చంద్రబాబు గారూ అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ ను బయట పెట్టాలని, ఎన్ని ఉల్లంఘనలు చేశారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
Next Story

