Wed Mar 11 2026 13:56:12 GMT+0530 (India Standard Time)
KTR : ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి : కేటీఆర్
స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు

కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇద్దరికీ క్లీన్ చిట్ ఇవ్వడం అంటేప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కేటీార్ అన్నారు. ఇటువంటి తీర్పులు ప్రజలను అనుమానించడమేనని అన్నారు.
స్పష్టంగా ఆధారాలున్నా...
పార్టీ మారి కాంగ్రెస్ బీఫారంపై పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి తీర్పులతో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోతుందని చెప్పారు. తాము ఈ తీర్పు పై పార్టీలో చర్చించి తర్వాత ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Next Story

