Sat Dec 13 2025 22:32:53 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నేడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్
నేడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.

నేడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు హైదరాబాద్ నగరంలో మరొక ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారంతో నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన లోటు పాట్లపై కూడా చర్చించనున్నారు.
కౌన్సిల్ సమావేశంలో...
దీంతో పాటు కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ చర్చించనున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో హైడ్రా కూల్చివేతలు, తాగు నీటి ఇబ్బందులు, రహదారులు అద్వాన్నంగా మారడం వంటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లకు సూచించనున్నారు. ప్రజాసమస్యలపై స్పందించాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

