Tue Mar 17 2026 11:17:03 GMT+0530 (India Standard Time)
Breaking : పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది

పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడి అరెస్టయిన రోహిత్ రెడ్డికి పార్టీ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. విచారణ పూర్తయ్యేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపింది.
డ్రగ్స్ కేసులో...
వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులో పేర్కొంది. గత శనివారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు డ్రగ్స్ తీసుకుని దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఈ వివరణ కోరింది.
Next Story

