Sat Dec 13 2025 19:28:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి బీఆర్ఎస్ దీక్షా దివస్
తెలంగాణలో నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది

తెలంగాణలో నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి ప్రకటన విడుదలయిన డిసెంబరు 9వ తేదీ వరకూ ఊరూరా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షను గుర్తుకు తెచ్చుకుంటూ నేటి నుంచి పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. రక్తదాన, అన్నదాన శిబిరాలను నిర్వహించనున్నారు.
పదకొండు రోజుల పాటు...
ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు దీక్షాదివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు నేటి నుంచి రాష్ట్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాలను పార్టీ జెండాలతో పాటు కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరించారు. గులాబీ జెండాలను ఊరూరా కట్టారు. అనేక కార్యక్రమాలతో నాటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని నెమరవేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు.
Next Story

