Sun Mar 15 2026 08:54:23 GMT+0530 (India Standard Time)
BRS : కారు దిగేసిన మరో కీలక నేత
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలింది. ఆ పార్టీలో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు.

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలింది. ఆ పార్టీలో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలకు ముందు ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరికొందరు నేతలు ఇదే బాటన పట్టే అవకాశాలన్నాయని చెబుతున్నారు.
పార్టీ పదవికి...
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు.
Next Story

