Wed Jan 07 2026 03:48:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరగనుంది.

నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరగనుంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈరోజు ఆవిర్భవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సభ్యులందరినీ ఆహ్వానించారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా కేసీఆర్ ప్రకటించనున్నారు.
డిసెంబరు తొమ్మిదినే...
డిసెంబరు 9కి మరో ప్రత్యేకత కూడా ఉంది. 2009లో డిసెంబరు 9న కేసీఆర్ దీక్షకకు దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం తొలుత తెలంగాణ రాష్ట్ర ప్రకటనను చేసింది. దీంతో ఈరోజును ప్రత్యేకదినంగా పరిగణిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ నిన్న ఎన్నికల కమిషన్ ప్రకటన చేయడంతో ఈరోజు ఆవిర్భవ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలోనే ప్రత్యేక జెండాను కూడా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కారు గుర్తు అలాగే ఉంటుంది. గులాబా రంగు జెండాపై భారత దేశ చిత్ర పటాన్ని ముద్రించనున్నారు.
Next Story

