Tue Mar 24 2026 08:30:54 GMT+0530 (India Standard Time)
మోదీ కామెంట్స్‌కు బీఆర్ఎస్ కౌంటర్
నిజామాబాద్ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది

నిజామాబాద్ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ సాధించిన తర్వాత ఏ పార్టీతోనూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. అలాంటిది తాము ఎన్డీఏలో ఎందుకు చేరతామని ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ ఎన్నికల వేళ మాట్లాడే మాటలు ఇవేనని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పొత్తుల కోసం తాము బీజేపీతో చర్చించలేదన్నారు. ఇన్ని రోజులు మాట్లాడకుండా మోదీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఎవరితో పొత్తు కోసం...
భారత్ బయోటెక్ కార్యక్రమానికి వచ్చినప్పుడు మోదీ ఏం చేశారని ఆయన నిలదీశారు. కేసీఆర్ ఎప్పుడూ ఎవరితోనూ పొత్తుల కోసం ప్రయత్నించలేదన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరి మద్దతు కోసమో తాను పరితపించలేదన్నారు. ఎన్నికల వేళ ఇలా మాట్లాడటం ప్రధాని హోదాలో తగదని వినోద్ కుమార్ అన్నారు.
Next Story

