Sun Mar 08 2026 05:12:57 GMT+0530 (India Standard Time)
తలనీలాలు సమర్పించిన కేసీఆర్ సతీమణి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దగ్గరుండి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శోభ శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి శోభ తలనీలాలను కూడా సమర్పించుకున్నారు. తిరుమలకు చేరుకున్న కేసీఆర్ సతీమణికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆమెకు అన్ని రకాలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అక్కడి నుంచి...
కేసీఆర్ సతీమణి శోభ వెంట కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆమె శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లారు. శ్రీకాళహస్తిలోనూ శోభ ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్న కోరికతోనే ఆమె తిరుమలకు వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

