Sun Mar 15 2026 09:17:04 GMT+0530 (India Standard Time)
KCR : నేడు రెండో రోజు కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటికి రెండో రోజుకు చేరుకోనుంది.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటికి రెండో రోజుకు చేరుకోనుంది. నేడు సూర్యాపేట నుంచి బయలుదేరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు. నిన్న బస్సు యాత్రను ప్రారంభించిన కేసీఆర్ మిర్యాలగూడ, సూర్యపేట లలో రోడ్ షోలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.
భువనగిరి పార్లమెంటులోకి...
రాత్రికి సూర్యాపేటలోనే కేసీఆర్ బస చేశారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రాత్రి బస చేసిన కేసీఆర్ నేడు భువనగిరి వరకూ బస్సు యాత్ర చేపడతారు. 17 రోజుల పాటు ఏకబిగిన బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంగా ఆయన ఈసారి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.
Next Story

