Sun Mar 15 2026 15:41:48 GMT+0530 (India Standard Time)
KCR : నేడు మూడు చోట్లకు కేసీఆర్
ఈరోజు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు

తెలంగాణ ఎన్నికలు ఇంకా నెల రోజులు కూడా లేవు. అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజుకు మూడు సభలు చొప్పున నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ప్రజలను పార్టీ వైపు మరల్చేలా తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏం జరుగుతుందోనని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో...
అందులో భాగంగా ఈరోజు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సుడి గాలి పర్యటనలతో అందరి కంటే ముందు ప్రచారంలో తాను ఉండేలా చూసుకుంటున్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్ ప్రచారంలోనూ దూసుకెళుతున్నారు.
Next Story

