Sun Mar 08 2026 07:29:52 GMT+0530 (India Standard Time)
KCR : నేడు నిజామాబాద్ కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. గత నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రతో ప్రజలతో మమేకం అవుతూ సభలు, రోడ్ షోలతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచే లక్ష్యంగా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.
బస్సు యాత్రతో...
ీఈరోజు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ అభ్యర్థిని విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆయన పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు
Next Story

