Thu Jan 29 2026 05:34:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఔరంగాబాద్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఔరంగాబాద్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు

బీఆర్ఎస్ అధినేత నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఔరంగాబాద్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరికలు ఉంటాయని చెబుతున్నారు. మహారాష్ట్రపై ఫోకస్ పెంచిన కేసీఆర్ ఆ రాష్ట్రంలో మూడో సభను నిర్వహిస్తుండటం విశేషం. కొద్దిగా పట్టు దొరకడంతో ఇక కేసీఆర్ మహారాష్ట్రపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
సభకు భారీగా...
ఔరంగాబాద్ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డితో పాటు మరికొందరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో జనసమీకరణకు కూడా సిద్ధమయ్యారు. తెలంగాణ పథకాల పట్ల ఆకర్షితులై మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను దగ్గర తీసుకుంటారని కేసీఆర్ ఆశిస్తున్నారు.
- Tags
- kcr
- aurangabad
Next Story

