Thu Dec 18 2025 18:02:37 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కరీంనగర్ కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కరీంనగర్ లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కరీంనగర్ లోని రాంనగర్ చౌరస్తా నుంచి కరీంనగర్ లోకి రానున్న కేసీఆర్ కు భారీ స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలి రానున్నారు.
రోడ్ షో..తో పాటు కార్నర్ మీటింగ్....
అక్కడి నుంచే కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మంకమ్మ తోట, టూటౌన్ పోలీస్ స్టేసన్, ముకరంపుర మీదుగా తెలంగాణ చౌక్ వరకూ ఈ రోడ్ షోజరగనుంది. తెలంగాణ చౌక్ లో జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కమార్ కు మద్దతుగా ఆయన ఈరోజు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సభకు పెద్దయెత్తున జనమీకరణను గులాబీ పార్టీ నేతలు చేయనున్నారు.
Next Story

